సుడిగాలి బీభత్సం.. 14 మంది దుర్మరణం

Update: 2020-08-29 14:39 GMT

అమెరికాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. లూసియానా, టెక్సాస్‌లలో సుడిగాలి విజృంభించింది. దీని ప్రభావంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. లూసినియానాలో 10 మంది మరణించినట్లు గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ ధృవీకరించారు. మిగతా నలుగురు వ్యక్తులు ఇళ్లు కూలిపడటం వల్ల మృతి చెందినట్లు తెలిపారు. తుఫానులో పడవ మునిగిపోవడంతో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. 

Tags:    

Similar News