భారత్, చైనా విదేశాంగ మంత్రుల కీలక భేటీ కజక్ స్థాన్ లో జరిగింది. సరిహద్దు వాస్తవాధీన రేఖను గౌరవించడంతోపాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగ శాఖ చైనాకు స్పష్టం చేసింది. కజకిస్థాన్‌లోని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సులో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు.
సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జైశంకర్. సైనిక, దౌత్యమార్గాల్లో ఈ ప్రయాత్నాలను వేగవంతం చేసేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించినట్లు సమాచారం.