జమ్మూకశ్మీర్ లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు పొట్టనబెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ ను యుద్ధ భయం వెంటాడుతోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గేలా చూడాలంటే ప్రపంచ దేశాలను వేడుకుంటుంది. ఇటీవలే అమెరికాతో మంతనాలు సాగించిన పాక్ తాజాగా రష్యా సాయం కోరింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య పరమైన జోక్యం చేసుకోవాలని మాస్కోలోని పాక్ రాయబారి మహ్మద్ ఖలీద్ జమాలీ ఆ దేశానికి విజ్ఞప్తిచేశారు. రష్యా ప్రభుత్వ పత్రిక టాస్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తమ దేశంతో గట్టి సంబంధాలు కొనసాగిస్తూనే ఇండియాతో రష్యా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 1966లో చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలికినట్లే, ప్రస్తుతం రష్యా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల మన విదేశాంగ మంత్రి జైశంకర్తో ఫోన్లో మాట్లాడిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ ... సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ స్పూర్తితో మూడో దేశం మధ్యవర్తిత్వం లేకుండా ఇరుపక్షాలు ఉద్రికత్తలు తగ్గించుకోవాలని కోరారు. పాక్ లో పర్యటిస్తున్న ఇరాన్ మంత్రి ఇస్లామాబాద్: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఫీ ఇవాళ పాకిస్తాన్లో పర్య టిస్తున్నారు. అక్కడ ఆయన పాక్ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్లతో సమావేశం అవుతారని పా కిస్తాన్ రేడియో వెల్లడించింది. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత పర్యటనకు ఒకరోజు ముందు ఆయన పాక్ వెళ్లారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరాన్ మధ్యవర్తిత్వానికి ప్రయత్నం చేస్తుంది.