ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లి.. నదిలో శవమై..
బ్రిటన్‌లో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థి లండన్ నదిలో శవమై కనిపించాడు.;
బ్రిటన్‌లో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థి లండన్ నదిలో శవమై కనిపించాడు. మెట్రోపాలిటన్ పోలీసులు నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు.
గత నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన 23 ఏళ్ల భారతీయ విద్యార్థి ఇక్కడి థేమ్స్ నదిలో శవమై కనిపించాడు. మిత్‌కుమార్ పటేల్ సెప్టెంబరులో ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుంచి అతడు కనిపించక పోవడంతో పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో
మెట్రోపాలిటన్ పోలీసులు థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మరణం అనుమానాస్పదంగా లేదని మెట్ పోలీసులు తెలిపారు. మిత్ కుమరా్ రైతు కుటుంబానికి చెందినవాడు. అతడి మరణం మా అందరినీ కలచి వేస్తోంది. కాబట్టి, మేము అతని కుటుంబానికి సహాయం చేయడానికి నిధుల సేకరణ చేయాలని నిర్ణయించుకున్నాము. అతని మృతదేహాన్ని భారతదేశానికి కూడా పంపించాము, ”అని స్నేహితుడు ఒకరు తెలిపారు.
ఈ నిధులను భారతదేశంలోని మిత్‌కుమార్ కుటుంబానికి పంపిస్తామని తెలిపారు. 'ఈవినింగ్ స్టాండర్డ్' వార్తాపత్రిక ప్రకారం, మిత్ కుమార్ షెఫీల్డ్ హాలం విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అమెజాన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసేందుకు నవంబర్ 20న షెఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉంది.
అతను రోజువారీ కార్యకాలాపాలను ముగించుకుని లండన్‌లో ఉంటున్న ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని బంధువులు ఆందోళన చెందారు. అతను తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు.