రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన S-400 క్షిపణి వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్ సమయంలో గేమ్ ఛేంజర్ గా వ్యవహరించాయి. పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చాయి. ఇప్పటికే మూడు S-400 క్షిపణి వ్యవస్థలు భారత్ కు చేరగా మరో రెండు అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. వీలైతే S-400కు అప్ గ్రేడ్ వర్షన్ అయిన ఆధునాతన S-500 క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని యత్నిస్తోంది..