ఇజ్రాయెల్ బలవంతంగా తమను ఘర్షణలోకి లాగిందని ఇరాన్ తెలిపింది. తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతిని ఆశిస్తున్నామని తేల్చిచెప్పింది. ఇజ్రాయెల్తో ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసాద్ పెజెష్కియాన్ ఖతార్ వెళ్లారు. అక్కడ ద్వైపాక్షిక చర్చలతోపాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతు కూడగట్టేందుకు యత్నించనున్నారు. వారంపాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతి నెలకొల్పుతామని, అమెరికా, ఐరోపా దేశాలు కోరాయన్న ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కానీ ఇజ్రాయెల్ ఇంకా హత్యలు చేస్తూనే ఉందని, అది నేరాలను ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడి చేస్తే మరింత భయం కరంగా ప్రతి దాడి చేస్తామని హెచ్చరించారు.