Israel : ఇజ్రాయెల్ కార్చిచ్చు.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Update: 2025-05-02 10:00 GMT

ఇజ్రాయెల్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది. దావానలంలా వ్యాపించిన అగ్నికీలలు బీభత్సం నెలకొంది. జెరూసలెం శివారులోని అడవుల్లో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. ఈ కార్చిచ్చుతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ కార్చిచ్చు కారణంగా 14 మంది గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. ప్రాణ నష్టం గురించి ఎలాంటి నివేదికలు వెల్లడికాలేదు. జెరూసలెం నుంచి టెల్ అవీవ్ ను కలిపే ప్రధాన రోడ్డు సహా అన్ని రహదారులను మూసివేశారు. చాలా మంది తమ కార్లను వదిలిపెట్టి ప్రాణ భయంతో పరుగులుతీస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. దాదాపు 160కి పైగా రెస్క్యూ, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ దేశ సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటని అధికారులు పేర్కొన్నారు. కార్చిచ్చుపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి. మంటలు జెరూసలెం వరకూ వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News