Israel : గాజాలోకి వాహనాలు ఆపేసిన ఇజ్రాయెల్

Update: 2025-03-04 10:45 GMT

గాజాలోకి వాహనాల రాకపోకల్ని ఇజ్రాయెల్ నిలిపేసింది. దీంతో ఆహారం సహా ఇతర వస్తువుల ప్రవేశానికి విఘాతం కలిగింది. ఐక్యరాజ్యసమితి, ఇతర మానవతా సహాయ ప్రదాతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిని అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా అభివర్ణిస్తున్నారు. దోపిడీకి ఇదొక సాధనంగా ఇజ్రాయెల్ వాడుతోందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సామూహిక శిక్ష యొక్క నిర్లక్ష్య చర్య అని ఆక్స్ ఫామ్ సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్ “ఆకలిని ఆయుధంగా" ఉపయోగిస్తోందని కీలక మధ్యవర్తి ఈజిప్ట్ ఆరోపించింది. గాజాలోని 2 మిలియన్ల కుపైగా ప్రజలకు ఆకలి ఒక సమస్యగా ఉంది. ఇక్కడ తీవ్ర కరు వు సంభవించే అవకాశం ఉంది అని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు. గత ఆరు వారాల కాల్పుల విరమణ తర్వాత ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు పునరావృతం కావడం మళ్లీ యుద్ధభయాల్ని రేకెత్తిస్తున్నాయి. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చాలా కష్టతరమైన రెండవ దశపై చర్చలు ప్రారంభించడానికి బదులుగా కాల్పుల విరమణ మొదటి దశను పొడిగించి, దీనిని అమెరికా ప్రతిపాదనగా అభివర్ణించి దాన్ని ఒప్పుకోవాలని హమాస్ గ్రూప్పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ తీరుపై స్పందించని అమెరికా యుద్ధ విరమణ మొదటి దశ శనివారంతో ముగిసింది.

Tags:    

Similar News