Crime : ఇజ్రాయెల్‌ దాడులు.. గాజాలో 44 మంది మృతి

Update: 2025-09-29 08:56 GMT

హమాస్ ను అంతం చేసి తమ పనిని పూర్తి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో పేర్కొన్న కొన్ని గంటలకే గాజాపై I.D.F విరుచుకుపడింది. గత 24 గంటల వ్యవధిలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 44 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని గాజా అధికారులు తెలిపారు. వీరంతా నుసీరత్ శరణార్థి శిబిరంలో ఉంటున్నారని పేర్కొన్నారు. హమాస్ పేరుతో జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఆరోపించారు. మరోవైపు హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హమాస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాలపై మాత్రమే దాడులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 66వేలు దాటింది. గాయపడ్డవారి సంఖ్య లక్షా 68 వేలు దాటింది.

Tags:    

Similar News