Israeli : ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు

Update: 2024-10-26 13:00 GMT

ఇజ్రాయెల్ యుద్ధం మరో రక్తపు మజిలీకి చేరుకుంది. ఇరాన్ సైనిక స్థావరాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. తెల్లవారుజామున టెహ్రాన్ కు చెందిన సైనిక స్థావరాల టార్గెట్ గా ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ పై 200 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. రాజధాని టెహ్రాన్ సహా నాలుగు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల కారణంగా ఇరాక్‌ తన విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసింది. తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది.

Tags:    

Similar News