Hindu Temple in UAE : యూఏఈలో హిందూ దేవాలయం ప్రత్యేకతలు ఇవే

Update: 2024-02-15 12:36 GMT

అబుదాబిలో (Abu Dhabi) బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) సొసైటీ నిర్మించిన విశాలమైన హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఫిబ్రవరి 15న ప్రారంభించారు. పూజారులతో కలిసి ఆలయంలో ప్రార్థనలు చేశారు. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌కు పీఎం మోడీ థ్యాంక్స్ చెప్పారు.

27 ఎకరాల స్థలంలో నిర్మించబడిన అబుదాబిలోని మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం ఇది. భారతీయ సంస్కృతి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రత్యేక సమ్మేళనాన్ని ఈ గుడి సమ్మిళితంగా ప్రపంచానికి చాటి చెబుతోంది.

బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం, షేక్ జాయెద్ మసీదు ఇలాంటి భవనాల సరసన ఇపుడు హిందూ దేవాలయం కూడా చేరింది. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవే సమీపంలోని అబు మురీఖాలో 27 ఎకరాల స్థలంలో అతిపెద్ద హిందూ ఆలయం నిర్మించారు. శంకుస్థాపన కార్యక్రమం 2019లో జరిగింది. విశాలమైన నిర్మాణం 3,000 మందిని ఉంచే సామర్థ్యంతో ప్రార్థన మందిరాన్ని కలిగి ఉంది. ఒక కమ్యూనిటీ సెంటర్, ప్రదర్శనశాల, గ్రంథాలయం, పిల్లల పార్కు ఉన్నాయి.

రాజస్థాన్, గుజరాత్‌కు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ గుడి నిర్మించారు. టెంపుల్ ముఖ భాగంలో 25,000 కంటే ఎక్కువ రాతి ముక్కలతో రూపొందించిన సొగసైన పాలరాతి శిల్పాలు ఉన్నాయి. పింక్ ఇసుకరాయి రాజస్థాన్ నుండి రవాణా చేయబడింది. ఈ ఆలయం సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఇది UAEలోని ఏడు ఎమిరేట్స్‌లో ఒకదానిని సూచించే ఏడు శిఖరాల కిరీటం ధరించి 108 అడుగుల ఎత్తులో ఉంది. BAPS మందిర్ చుట్టూ ఉండే ఘాట్‌లు, గంగా, యమునా నదుల లక్షణాలు ఉన్నాయి. 'డోమ్ ఆఫ్ హార్మొనీ', 'డోమ్ ఆఫ్ పీస్' అనే రెండు గోపురాలు నిర్మించారు. నిర్మాణంపై 'రామాయణం' కథలను కూడా చిత్రించారు. ఏడుగురు దేవతలకు సంబంధించిన మందిరాలు కూడా భక్తులను ఆకర్షించనున్నాయి.

Tags:    

Similar News