భారత్ లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం : అమెరికా
ఇండియాలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిందని చెప్పిన అమెరికా.. లాక్‌డౌన్ ఒక్కటే కట్టడికి పరిష్కారం అని సూచించింది;
ఇండియాలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిందని చెప్పిన అమెరికా.. లాక్‌డౌన్ ఒక్కటే కట్టడికి పరిష్కారం అని సూచించింది. అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మళ్లీ మామూలు పరిస్థితులు చూడాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని చెప్పుకొచ్చారు.
కనీసం కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ పెడితే కరోనాను కట్టడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా లాక్‌డౌన్ పెట్టడానికి ఇష్టపడడం లేదంటూనే... అది తప్ప వేరే ఆప్షనే లేదని చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గమన్నారు ఆంటోని ఫౌచీ. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం భారత్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
సెకండ్ వేవ్ కారణంగా భారత్‌లో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయని అన్నారు. దీంతో మే 4 నుంచి ఇండియా నుంచి వచ్చే రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. భారత్‌లో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.