కెనడాలోని ఒంటారియోలో గౌరీ శంకర్ మందిరం ఆధ్వర్యంలో మహారుద్రయాగం నిర్వహించారు.. మూడు రోజులపాటు రుద్రయాగం శాస్త్రోక్తంగా సాగింది.. 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.. జీఆర్‌డీ అయ్యర్ గురుకుల్ వ్యవస్థాపకులు రమేష్ నటరాజన్, ఆయన సతీమణి గాయత్రీ రమేష్ ఈ మహా సంకల్పానికి పూనుకున్నారు.. మూడురోజులపాటు జరిగిన ఈ యాగంలో జీఆర్‌డీ అయ్యర్ బృందం వారు శ్రీ రుద్ర పఠనం గావించారు. అనంతరం మహాగణపతి హోమం, రుద్ర ఘన పాఠం చేశారు. వేద పఠనంతోపాటు శ్రీ విద్యా నవావరణ పూజ, శ్రీరుద్ర హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాంప్టన్ నగర మేయర్ పాట్రిక్ బ్రౌన్, బ్రాంప్టన్ నగర కౌన్సిలర్ డెన్నిస్ కీనన్ విచ్చేశారు.. మహిళలు కూడా వేద పఠనం, హోమాలు చేయడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.