Iran: డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

మంటల్లో 32 మంది సజీవ దహనం, మరో 16 మందికి తీవ్ర గాయాలు

Update: 2023-11-04 02:30 GMT

ఇరాన్‌లో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో బాధితులు అందులో చిక్కుకు పోయారు. దేశ రాజధాని టెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న గిలాన్‌లోని కాస్పియన్ సీ ప్రావిన్స్‌లోని లంగర్డ్‌లోని ఓపియం పునరావాస శిబిరంలో అగ్నిప్రమాదానికి గల కారణాలపై న్యాయవ్యవస్థ విచారణ జరుపుతోందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్ద తెలిపింది

మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బాధితులు తప్పించుకునే మార్గం లేకుండా పోయినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ రాలేదు.ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు. ఈ సెంటర్‌ నిర్వాహకుడితో పాటు పలువురిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.

అయితే అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. స్థానిక మిజాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వైపు పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. స్థానిక ISNA వార్తా సంస్థ.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీని షేర్ చేసింది.

మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దెబ్బతిన్న అనంతరం అనేక ఇతర ఫోటోలు బయటికి వచ్చాయి. గాయపడిన వారిని టెహ్రాన్‌కు వాయువ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్‌రౌడ్‌లోని ఆసుపత్రులకు తరలించారు.కేంద్రం నిర్వాహకులు, అధికారులు విచారణలో ఉన్నారని మిజాన్ వార్తా సంస్థ తెలిపింది.యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రకారం, ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వ్యసనాలలో ఒకటయిన డ్రగ్స్ తో పోరాడుతోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి పశ్చిమ ఐరోపా వరకు నల్లమందు మరియు హెరాయిన్‌లకు మూలమైన గసగసాలను రవాణా చేసే ప్రధాన మార్గంలో ఉంది.

Tags:    

Similar News