Mozambique: మొజాంబిక్ పడవ ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, ఐదుగురు గల్లంతు

సెంట్రల్ మొజాంబిక్‌లోని బెయిరా ఓడరేవు సమీపంలో సిబ్బంది బదిలీ ఆపరేషన్ సందర్భంగా లాంచ్ బోట్ బోల్తా పడటంతో ముగ్గురు భారతీయులు మరణించారు.

Update: 2025-10-18 06:49 GMT

సెంట్రల్ మొజాంబిక్‌లోని బైరా ఓడరేవు సమీపంలో బోట్ బోల్తా పడటంతో ముగ్గురు భారతీయులు మరణించారని, మరో ఐదుగురు గల్లంతయ్యారని భారత హైకమిషన్ శనివారం (అక్టోబర్ 18) ధృవీకరించింది. లాంచ్ బోట్ లో 14 మంది భారతీయులు ఉన్నారు. 

"బైరా ఓడరేవు వద్ద సిబ్బంది బదిలీ కార్యకలాపాల సమయంలో ట్యాంకర్ సిబ్బందిని తీసుకెళ్తున్న లాంచ్ బోట్, 14 మంది భారతీయ పౌరులతో సహా బోల్తా పడింది. కొంతమంది భారతీయ పౌరులను రక్షించారు. దురదృష్టవశాత్తు, కొందరు మరణించారు, మరికొందరి ఆచూకీ తెలియలేదు" అని భారత మిషన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా విచారం వ్యక్తం చేసింది.

"బైరా ఓడరేవు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాము" అని హైకమిషన్ పోస్ట్ చేసింది. మృతుల కుటుంబాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నామని కూడా హైకమిషన్ పేర్కొంది.

మొజాంబిక్ అధికారులు, ఇతర సంబంధిత సంస్థలు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టిందని హైకమిషన్ పేర్కొంది. తప్పిపోయిన అయిదుగురు భారతీయుల కోసం మిషన్ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది" అని హైకమీషన్ పేర్కొంది. 

Tags:    

Similar News