పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తాత్కాలికంగా ఊరట లభించింది. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 17వ తేదీ వరకు ఇమ్రాన్‌ను ఏ కేసులోనూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై రెండు వందలకు పైగా కేసులు ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో ఇమ్రాన్‌కు తాత్కాలిక ఉపశమనం దక్కింది.
మరో వైపు పాకిస్తాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా పీటీఐ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు.దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. వేలాది మంది ఆందోళనకారులను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. మీడియా ప్రసారాలపైనా ఆర్మీ ఆంక్షలు విధించింది.
ఆందోళనల్లో ఇప్పటి వరకు 10 మంది మరణించారు. లాహోర్‌లోని మిలటరీ కమాండ్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పాకిస్తాన్‌లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.