Pakistan : పాకిస్థాన్‌కు మోడీ లాంటోడే కావాలి.. పాక్ వ్యాపారి షాకింగ్ కామెంట్స్
ప్రధానిపై ఓ పాకిస్తానీ బిజినెస్ మ్యాన్ ప్రశంసలు గుప్పించారు. పాకిస్తాన్‌కి ప్రధాని నరేంద్రమోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. మోడీ మూడోసారి కూడా గెలుస్తారని జోస్యం చెప్పారు. పాకిస్తాన్-భారత్‌తో చర్చలు ప్రారంభించి వాణిజ్యం ప్రారంభించాలని సూచించారు.
భారతదేశాన్ని ప్రధాని మోడీ కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడని, ఆయన బలమైన నేత అని తరార్ కొనియాడారు. సాజిద్ తరార్ మాట్లాడుతూ.. మోడీ భారతదేశానికి మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి, ప్రపంచానికి చాలా మంచివాడు. పాకిస్తాన్‌కి కూడా అతనిలాంటి నాయకుడు వస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. భారత్ యువజనాభా నుంచి లాభం పొందుతుందని చెప్పారు. ''భారత్‌లో 97 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక అద్భుతం తప్ప మరోటి కాదు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. నేను అక్కడ మోడీజీకి ఉన్న ప్రజాదరణ చూస్తున్నా. 2024లో భారత్ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. భారత ప్రజాస్వామ్యం నుంచి భవిష్యత్తులో ప్రజలు నేర్చుకుంటారు'' అని తరార్ అన్నారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ కు మోడీలాంటి నాయకుడు కావాలన్న ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ లో చర్చనీయాంశంగా మారాయి.