సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో పాకిస్తాన్ నుండి నౌషేరాలో షెల్లింగ్ ప్రారంభమైంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, షోర్‌కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
మే 10 ఉదయం 3 గంటల 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసేస్తున్నట్లు పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.