Nikki Haley : పాకిస్థాన్ నాటకాలు ఆపాలి: నిక్కీ హేలీ

Update: 2025-05-09 10:00 GMT

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’‌కు ఐక్యరాజ్య సమితిలో US మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ మద్దతు ప్రకటించారు. ‘టెర్రరిస్టులు డజన్ల కొద్దీ భారతీయులను చంపారు. ప్రతీకారం తీర్చుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఇండియాకు హక్కు ఉంది. తాము బాధితులమంటూ పాకిస్థాన్ చేసే నాటకాలు ఆపాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఏ దేశమూ సపోర్ట్ చేయకూడదు’ అని ట్వీట్ చేశారు.

ఉగ్రస్థావరాలపై భారత్ దాడులను సమర్థిస్తూ పలు దేశాలు తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి యూరోపియన్ యూనియన్ చేరింది. ‘ఆపరేషన్ సిందూర్‌’కు మద్దతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. చట్టబద్ధంగా పౌరులను రక్షించడం బాధ్యత అని వెల్లడించింది. పాక్, భారత్ మధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. యూరోపియన్ యూనియన్ ఐరోపాలోని 27 సభ్య దేశాల సమూహం.

పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా రూపొందిన ఓటీటీ కంటెంట్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్‌లు, ఇతర మీడియా కంటెంట్‌ను మన దేశంలో బ్యాన్ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News