పాక్ ప్రధాని ప్రతీకార దాడులకు పాల్పడతామని భారత్ హెచ్చరించడంతో గడగడలాడుతున్న పాకిస్థాన్... సౌదీ ప్రభుత్వ సహకారా న్ని కోరింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నివారించడానికి భారత్ మాట్లాడాలని పాకి స్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం సౌదీ ప్రభుత్వాన్ని కోరారు. పాక్ వైఖరిని వివరించి సహాయం కోరుతూ ప్రభుత్వం తరపున చైనా, సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్ట్ సహా వివిధ దేశాలకు అధికారుల బృందాలను పంపారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ లోని సౌదీ అరేబియా దౌత్య వేత్తకు వివరించారు. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచిపోషి స్తున్న పాకిస్తాన్ ఈసారి కూడా ఉగ్రవాదులను ఉసిగొల్పిందని భారత్ భావిస్తూ తీవ్ర హెచ్చరికలు చేసింది. భూమిపై ఏ మూల ఉన్నా వెతికి శిక్షిస్తామని, ఉగ్రవాదులతోపాటు, వారి వెనుక ఉన్న వారినీ వదిలిపెట్టేది లేదని ప్రతినబూనింది.
భారత్ ను నేరుగా ఏమీ చేయలేక కుతకుతలాడుతున్న పాకిస్తాన్ భారత రక్షణ విభాగానికి చెందిన వివిధ వెబ్ సైట్లపై సైబర్ దాడులకు పాల్పడుతోంది. తాజాగా నాలుగు పోర్టల్స్ పై చేసిన దాడుల ను భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు విజయవంతంగా అడ్డుకోగలిగాయి. నాలుగు సంస్థలపై పాక్ సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడగా భారత్ అడ్డుకుంది. మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంస్థలు, ఆర్మీ స్కూల్క్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.