పాకిస్థాన్ మరోసారి బాంబు బ్లాస్టులతో షేక్ అయింది. క్వెట్టా రైల్వేస్టేషన్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా వెల్లడించింది. స్టేషన్ నుంచి రైలు పెషావర్‌కు బయలుదేరుతుండగా అక్కడ రద్దీ ఏర్పడింది. ఇదే సమయంలో పేలుడు జరగడంతో 40 మంది గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి బాంబు దాడిలా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆధారాలను సేకరించిందని బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. పేలుడు సమయంలో ఘటనాస్థలంలో 100 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది.