PAK-PM YouTube : పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానెల్ నిలిపివేత

Update: 2025-05-03 11:15 GMT

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ను భారత్ లో నిలిపివేశారు. ఈ ఛానెల్ను సందర్శించే వీక్షకులకు ఇప్పుడు 'జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదు' అని ఒక సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే పాక్ కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లను భారత్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పెద్ద మొత్తంలో సబ్ స్క్రైబర్లు ఉన్న ఈ ఛానెళ్లు భారతదేశం, భద్రతా దళాలను లక్ష చేసుకుని రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప ్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రప్రభుత్వం గుర్తించింది.

Tags:    

Similar News