Japan : జపాన్ లో జనాభా సంక్షోభం

Update: 2025-02-28 10:15 GMT

జపాన్లో నానాటికీ జనాభా సంఖ్య పడిపోతోంది. ఈ విషయంలో ఆ దేశ సంక్షోభంలోకి వెళ్తుంది. తాజాగా అక్కడ జననాల రేటు 5శాతం తగ్గింది. 2024 ప్రకారం జనాభా 7,20,988గా నమోదైంది. 1899 తర్వా త ఇంత తక్కువగా జననాల రేటు నమోదవడం ఇదే తొలి సారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకొకవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. పనిచేసేవారి సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వానికి ఈ పరిస్థితి భారంగా మారుతోంది. ఆదాయాలు తగ్గుతున్నాయి.. వ్యయాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా జన్మించే వారి సంఖ్య తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో ఏడాది అని జపాన్ ఆరోగ్యశాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2024లో మరణాల రేటు 1.8 శాతం పెరిగి 16 లక్షలకు చేరింది. జనాభా పెంపునకు ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటిస్తున్నా, అక్కడి యువత మాత్రం పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో ప్రధాని ఇషిబా చిల్డ్రన్ కేర్ పాలసీ కోసం ఏకంగా 3.6 ట్రిలియన్ యెన్లను కేటాయించారు. 1955లో జపాన్లో పనిచేసే జనాభా అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిరుద్యోగ రేటు 2.4 శాతంగా ఉంది. ఇది ఓఈసీడీ దేశాల్లోనే అతి తక్కువ. 2040 నాటికి 3శాతంగా కొనసాగొచ్చని అంచనా. కార్మికుల కొరత కారణంగా 2024లో జపాన్ లో 342 కంపెనీలు దివాలా తీశాయి. పెన్షన్ వ్యవస్థలో చందాదారుల సంఖ్య 30లక్షలు తగ్గగా, పెన్షన్ తీసుకునే వారి సంఖ్య 40 శాతం పెరిగింది. ఈ విషయాన్ని అక్కడి సంక్షేమ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News