Prince Harry: బ్రిటన్‌కు తిరిగి రానున్న ప్రిన్స్ హ్యారీ..!!

జనవరి 2020 సంవత్సరంలో మేఘన్, హ్యారీలు రాజకుటుంబంలో తమ సీనియర్ వర్కింగ్ పదవులు వదులుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం తమ ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.

Update: 2023-08-01 01:12 GMT

బ్రిటన్ రాజకుటుంబంలో గొడవలతో అమెరియాలో ఉంటున్న బ్రిటన్ యువరాజు హ్యారీ మళ్లీ బ్రిటన్‌కి రానున్నారా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఓ మ్యాగజైన్ కథనం ప్రకారం ప్రిన్స్ హ్యారీ, తన భార్య మేఘన్ మార్కెల్‌లు బ్రిటన్‌కి తిరిగి వచ్చి కుటుంబంతో కలవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. కుటుంబంతో కలిసి ఉండటం కాకుండా, కెన్సింగ్టన్ వద్ద ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

"ప్యాలెస్‌లో ఉంటూ బందీ కావడం హ్యారీ ఇష్టపడటం లేదు. హ్యారీ, మేఘన్ మార్కెల్‌లు తమ జీవితాల్లో సమతౌల్యం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే వారిని ఏ ఇతర అంశాలు మానసికంగా ఇబ్బంది పెట్టేలా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే వారు కెన్సింగ్టన్ ప్యాలెస్ వద్ద ఓ అపార్ట్‌మెంట్ అద్దె తీసుకుని నివసించాలనుకుంటున్నారు. అన్న విలియమ్‌ని సంతోషపరిచి, మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు." అని అనుకుంటున్నట్లు వెల్లడించింది.



జనవరి 2020 సంవత్సరంలో మేఘన్, హ్యారీలు రాజకుటుంబంలో తమ సీనియర్ వర్కింగ్ పదవులు వదులుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం తమ ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. రాజకుటుంబంలో తన అనుభవాలను గురించి స్పేర్ అనే బుక్‌ విడుదల చేశాడు. మేఘన్‌తో వివాహం సమయంలో అన్న విలియమ్‌ తనపై భౌతిక దాడికి దిగాడని, కుటుంబంలో పెళ్లి విషయంపై గొడవలు జరగడం వంటి వివరాలను బహిర్గతం చేశాడు.

2022 సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్-II అంత్యక్రియల సమయంలోనే చివరగా ఈ దంపతులిద్దరూ ఇతర రాజకుటుంబీకులతో కలిసి కనిపించారు. తదనంతరం సెప్టెంబర్‌లో జరిగిన కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం సమయంలో హ్యారీ కనిపించాడు. అయితే తన అన్న కూర్చున్న వరుసకు 2 వరసల వెనక స్థానం కేటాయించారు.

Tags:    

Similar News