మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ (93) ఐదోసారి వివాహం చేసుకున్నారు. USలో తన కంటే 25ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. మర్దోక్‌కు మొదట పాట్రీషియా బుకర్‌తో పెళ్లి కాగా 1960ల్లో విడిపోయారు. ఆ తర్వాత మరియామన్, విన్‌డీ డెంగ్, జెర్రీ హాల్‌లనూ వివాహం చేసుకుని పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్, ఫాక్స్ న్యూస్ తదితర సంస్థలను మర్దోక్ గ్రూప్ నిర్వహిస్తోంది. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో శనివారం వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహానికి అమెరికా ఫుట్‌బాల్ టీమ్ 'న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్' యజమాని రోబెర్ట్ క్రాఫ్ట్ (82), ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్ (50) హాజరయ్యారు.
మర్దోక్ తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్ ఇచ్చిన పార్టీలో జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారు. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్‌తో వివాహమైంది.