Auction in Nobel Peace Prize: వేలం పాటలో నోబెల్ బహుమతి.. వచ్చిన ఆ రూ.800 కోట్లతో..

Auction in Nobel Peace Prize: ఒక జర్నలిస్ట్ తన నోబెల్ శాంతి బహుమతిని ప్రజలకు సహాయం చేయడానికి విక్రయించాడు.

Update: 2022-06-21 10:30 GMT

Auction in Nobel Peace Prize: ఒక జర్నలిస్ట్ తన నోబెల్ శాంతి బహుమతిని ప్రజలకు సహాయం చేయడానికి విక్రయించాడు. భావప్రకటన స్వేచ్ఛ రంగంలో ఆయన చేసిన కృషికి గానూ 2021లో ఈ అవార్డును అందుకున్నారు.

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవ పురస్కారాలలో ఒకటైన నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న ఒక జర్నలిస్ట్ ప్రజలకు సహాయం చేయడానికి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన నోబెల్ అవార్డును అమ్మేశారు. ఈ బహుమతికి బదులుగా, హెరిటేజ్ వేలం ద్వారా జర్నలిస్ట్ దాదాపు 800 కోట్ల రూపాయలను పొందారు.

రష్యాలో నివసిస్తున్న ఈ జర్నలిస్ట్ పేరు డిమిత్రి మురాటోవ్. అతను స్వతంత్ర వార్తాపత్రిక నోవాయా గెజిటాకు ఎడిటర్-ఇన్-చీఫ్. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చిన వ్యక్తులకు సహాయం చేయడానికి బహుమతి వేలం వేయగా వచ్చిన మొత్తం డబ్బును ఇస్తానని డిమిత్రి చెప్పారు.

డిమిత్రి 2021 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. భావప్రకటన స్వేచ్ఛ యొక్క ఔచిత్యాన్ని కొనసాగించినందుకు ఆయన ఈ అవార్డును అందుకున్నారు. జర్నలిస్టు మరియా రెసాతో కలిసి ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మరియా ఫిలిప్పీన్స్ న్యూస్ సైట్ రాప్లర్ సహ వ్యవస్థాపకురాలు.

మరియా మరియు డిమిత్రి వారి పరిశోధనాత్మక నివేదికలకు ప్రసిద్ధి చెందారు. దీని కారణంగా, ఇద్దరు జర్నలిస్టులు తమ దేశ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ పరిశోదన సాగించారు. విశేషమేమిటంటే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరిగిన కొద్దిసేపటికే నోవాయా గెజిటా మూసివేయబడింది. ఎందుకంటే ఉక్రెయిన్‌పై రష్యా చర్యను ఎవరైనా 'యుద్ధం'గా అభివర్ణిస్తే, అతనికి భారీ జరిమానా విధించడంతో పాటు ఆ పత్రికను మూసివేస్తామని రష్యా ప్రభుత్వం చెప్పింది. రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ పై దాడులను 'ప్రత్యేక సైనిక చర్య'గా అభివర్ణించింది.

బంగారు పతకాన్ని విక్రయించిన తరువాత వచ్చిన డబ్బును యూనిసెఫ్‌కు సహాయం చేయనున్నట్లు హెరిటేజ్ వేలంపాట తెలిపింది. వేలం తర్వాత, డిమిత్రి ఒక వీడియో సందేశంలో ఇలా అన్నారు - చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, యుద్ధం జరుగుతోందని ప్రజలు అర్థం చేసుకున్నారు.. అలాగే, ఎక్కువగా ప్రభావితమైన వ్యక్తులకు మనం సహాయం చేయాలి అని ఆయన తెలిపారు.

Tags:    

Similar News