Independence Day Celebrations : అక్కడ అంజు.. ఇక్కడ సీమ ..

కేకులు కోసి, జండాలు ఎగరేసి స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు;

Update: 2023-08-15 06:30 GMT

ప్రేమికుల కోసం దేశం దాటిన మహిళలు ఇద్దరు చాలా ప్రముఖులుగా మారి వార్తల్లోకి ఎక్కారు. తనకు నచ్చిన వాడి కోసం సీమ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వస్తే, ఊరుకున్న వాడి కోసం అంజు ఇండియా నుంచి పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండు దేశాల్లు ఒక్క రోజు తేడాతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న పాకిస్తాన్ ప్రియురాలు సీమా హైదర్ 'భారత్ మాతాకీ జై ' అంటూ ఇక్కడ జెండా ఎగురవేస్తే భారత ప్రియురాలు అంజు అక్కడ 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినదిస్తూ అక్కడ కేక్ కట్ చేసింది.

ఆగస్టు 15 వచ్చిందంటే భారత దేశమంతటా పండగే. 77 ఏళ్ల క్రితం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగానికి దక్కిన ప్రతిఫలం మన స్వాతంత్య్రం. భారత దేశం తోపాటు పాకిస్తాన్‌ కూడా ఇలాగే భావిస్తుంది.. ఒక్కరోజు ముందుగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. అక్కడ కూడా మనలాగే వారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా విడివిడిగా జరుపుకొనే ఈ సంబరాల్లో ఈ ఏడాది ఒక కొత్త విషయం జరిగింది. సాధారణం గా అక్కడి వారు ఇక్కడి పతాకాన్ని ఎగరవేయడం కానీ ఇక్కడి వారు అక్కడి పతాకాన్ని కానీ ఎగరెయ్యడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ ఈసారి ఆ పని జరగడమే కాదు వైరల్ గా మారింది. అందుకు కారణం దేశాలు దాటిన ప్రేమ కధలే.


నేపాల్ మీదుగా అక్రమం గా భారత్‌లో అడుగుపెట్టిన సీమా హైదర్ భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేయగా, వాఘా బోర్డర్ మీదుగా అధికారికంగా దాయాది దేశం చేరుకున్న అంజు పాకిస్తాన్‌లో వారి జాతీయ జెండాను ఆవిష్కరించి కేకును కూడా కట్ చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌ ప్రకారం, అంజుకు మొత్తం 30 రోజుల వీసాను మంజూరు చేశారు. అది కూడా అప్పర్ దిర్‌ జిల్లాకు మాత్రమే చెల్లుతుంది. అంటే లెక్కప్రకారం, మరో వారం రోజుల్లో భారత్ కు తిరిగిరావాలి అంజు. లేదంటే ఆమెను పాకిస్థాన్ లో అరెస్ట్ చేస్తారు. ఇక తనపై ఎన్ని కేసులున్నా, అన్నిటికీ సమాధానాలిస్తానని, సచిన్ తోనే జీవితం కొనసాగిస్తానని చెబుతూ, మెడలో త్రివర్ణ పతాకాన్ని పోలిన చున్నీని ధరించి, 'హర్ ఘర్ తిరంగ' వేడుకల్లో పాల్గొంది సీమ. 

Tags:    

Similar News