హిమాలయ సమీప ప్రాంతాల్లో భీకర భూకంపం సంభవించింది. నేపాల్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.1గా భూకంప తీవ్రత నమోదైంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ NCS తెలిపింది. భారత్‌తోపాటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది. శిథిలాల కింద దాదాపు 40కి పైగా బాడీలు వెలికితీసినట్టు సమాచారం. రెస్క్యూ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే చాన్సుంది.
మరోవైపు.. భారత ఉత్తరాదిని భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రాజధాని ఢిల్లీలో, బిహార్ లో భూమి స్వల్పంగా కంపించింది. భూకంపం చాలా బలంగా ఉంది. కొన్ని సెకన్లపాటు ఇళ్లలోని సామాన్లు, ఫ్యాన్లు కదిలినట్లుగా సమాచారం ఉంది. భూకంపం ధాటికి ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భూప్రకంపనలతో అక్కడ నివసిస్తున్న వారు నిద్రలోంచి మేల్కొన్నారు. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.