TDP : వాషింగ్టన్ డీసీలో 'తెలుగు దేశం పార్టీ' ఆవిర్భావ వేడుకలు
వందలాది మంది ప్రవాసుల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి;
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వేదికగా తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.. వందలాది మంది ప్రవాసుల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి.. ఇటీవల పార్టీ ఎమ్మెల్సీల ఘటన విజయాన్ని, యువగళం 50 రోజుల దిగ్విజయ యాత్ర సందర్భంగా సంతోషంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత సంబరాలు చేసుకున్నారు.. టీడీపీ ఎప్పుడూ బీసీ, బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగిందన్నారు.. రాబోయే ఎన్నికల్లో దార్శనికుడు చంద్రబాబు సమర్థ నాయకత్వం చారిత్రక అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నాయకులు సతీష్ వేమన, సీనియర్ నాయకులు మన్నవ సుబ్బారావు, స్థానిక కార్యవర్గం భాను మాగులూరి, సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, కార్తీక్ కోమటి పాల్గొన్నారు.