England : ‘టైటానిక్’ ఆఖరి డిన్నర్ మెనూ వేలం
రూ.84 లక్షలు పలికిన టైటానిక్ షిప్ డిన్నర్ మెనూ
టైటానిక్ షిప్ కు చెందిన భోజనం తాలూకు మెనూ కాగితం వేలంలో రూ.84.5 లక్షలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 1912లో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకలోని మెనూ కావడమే దాని విశేషం. ఆ షిప్ కు సంబందించి మెనూ కాపీ అదొక్కటే ఉంది. ఇంగ్లండ్ లో ఇటీవల నిర్వహించిన వేలంలో రూ.84.5 లక్షలకు దాన్ని ఓ వ్యక్తి దక్కించుకున్నారు. బీఫ్, రోస్ట్ చికెన్, అన్నం, ఉడకబెట్టిన ఆలుగడ్డలు, వైన్ వంటి ఆహార పదార్థాల జాబితా ఆ మెనూలో ఉంది.
టైటానిక్ షిప్( Titanic ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఓడ శిథిలాలను కనిపెట్టేందుకు, దానికి సంబంధించిన అవశేషాలు బయటకు తీసుకొచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.ఓడకు సంబంధించి ఏవైనా దొరికితే వారు వాటిని ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ షిప్ మునిగిపోవడానికి మూడు రోజుల ముందు 1912, ఏప్రిల్ 11న టైటానిక్ ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూ రూపొందించారు.అయితే అది ఇప్పటి తరం వారికి దొరికింది. షిప్ మునిగిపోవడానికి మూడు రోజుల ముందు ఈ మెనూ అందించినట్లు అందులోని తేదీలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ మెనూ వేలంలో 83 వేల పౌండ్లు ( రూ.84.5 లక్షలు) ధర పలకడం విశేషం.
ఈ మెనూ కెనడా( Canada )లోని నోవా స్కోటియాకు చెందిన చరిత్రకారుడు లెన్ స్టీఫెన్‌సన్ ఫొటో ఆల్బమ్‌లో కనుగొనబడింది.అతను ఓడలో ఉన్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు.అలాగే తనతో పాటు ప్రాణాలతో బయటపడ్డ వారి నుంచి, తన పట్టణంలో ఖననం చేయబడిన బాధితుల నుంచి టైటానిక్ జ్ఞాపకాలను సేకరించాడు.ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి మెనూ దొరకలేదని వేలం సంస్థ హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ మేనేజర్ ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ అన్నారు.
ఇక మెనూను చూసిన తర్వాత లైఫ్ బోట్‌లకు తరలిస్తున్నప్పుడు ఈ మెనూను ఎవరు తీసుకున్నారు? విక్టోరియా ఫుడ్డింగ్ అంటే ఏంటి? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ సాయంత్రం ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్ క్రీం పిండి మిశ్రమం, గుడ్లు, జామ్, బ్రాందీ, యాపిల్స్, చెర్రీస్, పీల్, చక్కెర మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమం ఉంది. మెనూ నీటితో తడిసినా వైట్ స్టార్ లోగోను కలిగి ఉంది. ఏప్రిల్ 11 న ఆస్టెర్స్, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాటు, చికెన్, బంగాళా దుంపలు, రైస్ మరియు పార్స్నిప్ పూరితో సహా పలు వంటకాల జాబితాను మెనూ చూపిస్తోంది.
అయితే ఈ టైటానిక్ చివరి డిన్నర్ మెనూను హెన్నీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ ఆఫ్ విల్ట్‌షైర్ వేలం వేసింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ వేలంలో ఆ డిన్నర్ మెనూ 83 వేల పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.84.5 లక్షలు పలికిందని బ్రిటన్‌కు చెందిన వార్తా పత్రిక గార్డియన్ తాజాగా కథనం ప్రచురించింది.