డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్)కు సంబంధించిన అధికారిక కార్యాలయాన్ని వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారన్న కథనాలను అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. వైట్ హౌస్ లోని పశ్చిమభాగంలోని ఓవల్ ఆఫీసులో ఎలన్ మస్క్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై ట్రంప్ స్పందించారు. డోజ్ చీఫ్ అయిన మస్క వేరే ప్రాంతంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.