Gold Card : ‘గోల్డ్ కార్డు’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన ట్రంప్

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాకు చూపించిన ట్రంప్;

Update: 2025-04-04 05:00 GMT

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేశారు. అంతేకాకుండా విదేశీయులకు జన్మతహ పౌరసత్వాన్ని రద్దు చేశారు. వీసాలకు బ్రేక్ వేశారు. కానీ ఆ మధ్య ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ కార్డు ఇస్తామని.. 5 మిలియన్‌ డాలర్లతో వస్తే పౌరసత్వాన్ని పొందుకోవచ్చని వెల్లడించారు. తాజాగా అందుకు సంబంధించిన గోల్డ్ కార్డు యొక్క ఫస్ట్ లుక్‌ను ట్రంప్ విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ 5 మిలియన్ డాలర్ల గోల్డ్ కార్డ్‌ను చూపించారు. కార్డుపై ట్రంప్ ఫొటో ఉంది. రెండు వారాల్లోపు కార్డ్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

గోల్డ్ కార్డును 5 మిలియన్‌ డాలర్లతో ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ట్రంప్ తెలిపారు. ఈ కార్డును మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. రెండోది ఎవరు కొంటారనేది తెలియదని చెప్పారు. ఈ గోల్డ్‌ కార్డు రెండు వారాల్లో అమ్ముడయిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి రూ.43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) వెచ్చించేవారికి ఈ గోల్డ్‌ కార్డు అందిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. కార్డు కలిగి ఉన్నవారు అమెరికా పౌరసత్వాన్ని పొందుకుంటారు.

Tags:    

Similar News