UAE : యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష

Update: 2025-03-07 09:15 GMT

వేర్వేరు హత్య కేసులలో యూఏఈలోని ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. ఆయా కేసుల్లో వీరు దోషులుగా తేలడంతో ఉరిశిక్ష అమలు చేశారు. ఈ విషయాన్ని గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితులిద్దరు కేరళకు చెందిన మహమ్మద్ రినాష్, మురళీధరన్ పెరుమట్ట వలప్పిల్ గా పేర్కొంది. ఓ యూఏఈ వాసిని హత్య చేసిన కేసులో మహమ్మద్ రినాష్ దోషిగా తేలాడు. ఇక మురళీధరన్ ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో శిక్ష పడింది. ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ యూఏఈలోని అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కాసేషన్ తీర్పు వెలువరించింది. శిక్ష అమలుపై యూఏఈ అధికారులు ఫిబ్రవరి 28న భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. వీరిద్దరికీ అవసరమైన దౌత్య, న్యాయ సాయం అందజేసినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. మరణశిక్ష ప సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్లు పేర్కొంది.

Tags:    

Similar News