Typhoon : షాంఘైలో బెబింకా తుఫాను బీభత్సం

Update: 2024-09-17 08:45 GMT

బెబింకా తుపాన్ చైనాలోని షాంఘై ప్రావీన్స్ లో బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం చైనా వాణిజ్య కేంద్రమైన షాంఘైని తాకింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతమవుతున్న చైనాను ఈ తుపాన్ మరింత భయపెడుతోంది. ఈ తుపాన్ అత్యంత శక్తివంతమైనదని, గత 75 ఏళ్లలో ఇదే అత్యంత ప్రమాదకరమైనది అధికారులు భావిస్తున్నారు. గంటకు 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

షాంఘైలో చైనా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలకు సహాయం చేసేందుకు రెస్క్యూ సిబ్బందిని భారీగా మోహరించారు. పలు ప్రాతాల్లో సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. షాంఘై నుంచి దూరంగా ఉన్న అన్ని నౌకలు ఓడరేవుకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. చైనాలోని దక్షిణ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సాధారణమైపోయాయి. వారం క్రితమే యాగి తుపాను హెనాన్ ప్రావీన్సులో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లేలా చేసింది.

తుపాన్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షాంఘై లోని అన్ని హైవేలను మూసివేశారు. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తుపాన్ కారణంగా షాంఘైలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అన్ని విమానా లను రద్దు చేశారు. రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News