పేదరికం లేని సమాజం తయారు చేస్తా : చంద్రబాబు

జగన్ ఏపీకి పట్టిన దరిద్రం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకాశం జిల్లా మార్కాపురం బహిరంగ సభలో వైసీపీ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. మూడు ముక్కలాట ఆడుతున్న జగన్.. అమరావతిని నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో జగన్ విశాఖకు వెళ్లడం కాదు.. జనమే జగన్‌ను శాశ్వతంగా ఇడుపులపాయకు పంపిస్తారని చెప్పారు.
పేదరికం లేని సమాజం తయారు చేయాలనే సంకల్పం తీసుకున్నట్లు చెప్పారు చంద్రబాబు. ధనవంతుల నగరాల్లో హైదరాబాద్ 69వ స్థానంలో ఉందన్న చంద్రబాబు.. ఆ రోజు తాను వేసిన ఫౌండేషనే దానికి కారణమన్నారు. ఏ దేశానికి వెళ్లినా గర్వపడేలా తెలుగువాళ్లు ఉన్నట్లు చెప్పారు.
జగనన్న స్టిక్కర్స్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్ర జల ఇంటిపై జగన్ పెత్తనం ఏంటన్నారు. జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అ న్నారు. కోడి కత్తి కేసులో డ్రామాలు ఆడిన జగన్‌ను ఎలా నమ్మాలంటూ చంద్రబాబు క్వశ్చన్ చేశారు. జగన్ సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com