AP : సీఎం జగన్ పై 26 సీబీఐ, ఈడీ కేసులు

సీఎం జగన్ తనపై 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్‌నగర్ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయి.
జగన్ పెద్దకూతురు హర్షిణీరెడ్డి పేరిట రూ.4.43 కోట్ల విలువ చేసే 4.187 కిలోల బంగారం, చిన్నకూతురు వర్షితరెడ్డిల పేరిట రూ.4.40 కోట్ల విలువ చేసే 3.450 కిలోల బంగారు ఉంది. జగన్ పెద్దకూతురు పేరిట కర్ణాటకలో రెండు వాణిజ్యయేతర స్థలాలు, ఇడుపులపాయలలో 4.5 ఎకరాలు, 5.50 ఎకరాలు, కే.ఎల్లమవారిపల్లెలో, పాలెంపల్లెలో రూ.1.63 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.
ఇక చిన్న కూతురుకు అదే ప్రాంతంలో అంతే సమానంగా ఆస్తులు ఉన్నాయి. పెద్ద కుమార్తెకు 25.89 కోట్లు, చిన్నకుమార్తెకు 25.57 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు.
ఇక సీఎం జగన్ భార్య భారతి పేరిట రూ.5.29 కోట్ల విలువ చేసే 6.47 కిలోల బంగారు, వజ్రాలు ఉన్నాయి. ఎర్రగుడిపల్లె, కచివారిపల్లె, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లిలో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.56,92,19,104గా చూపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com