AP : ఏపీలో లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు

ఏపీలో శాసనసభ, లోక్‌సభ రెండింటికీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18 నుంచి నిన్నటి వరకు 25 లోక్‌సభ స్థానాలకు 965 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 5,460 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల సంఖ్య 2019 ఎన్నికల గణాంకాలను అధిగమించింది. 2019లో 175 అసెంబ్లీ స్థానాలకు 4,299, 25 పార్లమెంట్ స్థానాలకు 770 నామినేషన్లు దాఖలయ్యాయి.
తిరుపతిలో అత్యధికంగా 83 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో 34 మంది స్వతంత్రులు కాగా, మిగిలిన వారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు. మంగళగిరిలో (76), నంద్యాల (64), చంద్రగిరి (63), ఒంగోలు, విజయవాడ పశ్చిమ (61) చొప్పున నామినేషన్లు వేశారు. కమలాపురం నియోజకవర్గంలో అత్యల్పంగా 9 నామినేషన్లు నమోదయ్యాయి.
నేడు అధికారులు వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంటుది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఈసీ అధికారికంగా ప్రకటిస్తుంది. మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com