తండ్రికి కరోనా... కూతురు కళ్ల ముందే ప్రాణాలు విడిచాడు..!

తండ్రికి కరోనా... కూతురు కళ్ల ముందే ప్రాణాలు విడిచాడు..!
ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్న తండ్రిని చూసి తల్లడిల్లిపోయింది.

కరోనా.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్న తండ్రిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తానే వెళ్లి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. కానీ.. తండ్రి బతకలేదు.

గుక్కెడు నీళ్లు తాగిన ఆ కన్నతండ్రి కూతురు కళ్ల ముందే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో జరిగింది. కొయ్యానపేటకు చెందిన అసిరినాయుడు విజయవాడలో కూలీ పనులు చేసుకునేవాడు. ఇటీవల కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబసభ్యులతో కలిసి ఆదివావరం శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చాడు.

అసిరినాయుడును కరోనా సోకిందని తెలుసుకున్న కొయ్యానపేట గ్రామస్తులు.. వారిని ఊరికి దూరంగా ఉండాలని చెప్పారు. ఇంతలో అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కింద పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

కరోనా భయంతో తల్లి ఎంత వద్దంటున్నా కూతురు పట్టించుకోలేదు. కన్నతండ్రి మీద ప్రేమను చంపుకోలేక కూతురు వెళ్లి అసిరినాయుడు గొంతులో నీళ్లు పోసింది. ఇంతలోనే ఆయన తుదిశ్వాస విడిచాడు.

Tags

Next Story