AP : వైసీపీకి ఎదురుదెబ్బ.. పార్టీ మారనున్న మరో ఎంపీ?

కలు సమీపిస్తోన్న వేళ వైసీపీకి (YCP) మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అమలాపురం ఎంపీ (Amalapuram MP) చింతా అనురాధ (Chinta Anuradha), ఆమె భర్త తాళ్ల సత్యనారాయణ మూర్తి (Thalla Satyanarayana Murthy) బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. తాజాగా మూర్తి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. పురంధేశ్వరిని మర్యాదపూర్వకంగానే కలిసినట్టు తాళ్ల సత్యనారాయణ మూర్తి చెబుతున్నారు. మరి.. పురంధేశ్వరితో ఎలాంటి చర్చలు జరిగాయి.. బీజేపీ నుంచి ఎలాంటి హామీ లభించింది.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమేనా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది..
అమలాపురం ఎంపీ లేదా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్‌ను మూర్తి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమలాపురం ఎంపీ సీటుకు రాపాక వరప్రసాద్ పేరును వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సిట్టింగ్ ఎంపీగా ఉన్న తన భార్యకు వైసీపీలో సీటు దక్కకపోవడం.. పి.గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. బీజేపీలో చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com