AP : ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

AP : ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదని ఆస్పత్రులు తెలిపాయి. ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఆస్పత్రులు మాత్రం డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జీలు, సర్జరీలు పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పూర్తి వైద్య సేవలు అందిస్తామన్నాయి.

గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉంది. రూ.530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఈ నెల 2న సీఈఓ చెపారు. ఇప్పటివరకు చెల్లించలేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.

Tags

Next Story