AP : రాజకీయ నాయకులను అలా మార్చేది ప్రజలే : సుమన్

AP : రాజకీయ నాయకులను అలా మార్చేది ప్రజలే :  సుమన్

రాజకీయాలపై హీరో సుమన్ (Suman) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు దొంగలని అందరూ తిడుతుంటారని, అయితే వారిని అవినీతిపరులుగా మార్చింది ప్రజలేనని సుమన్ చెప్పారు. అన్ని పార్టీల నేతల వద్ద డబ్బులు తీసుకుని వారు ఓట్లు వేస్తున్నారని ఇక రాజకీయాల్లోకి రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

తాను ఇప్పటికే సమాజ సేవలో ఉన్నానన్నారు. తాను సెక్యులరిజం ఫాలో అవుతున్నానన్నట్లుగా సుమన్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లు పాలన బాగుండాలంటే ప్రజలు ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తాయని తెలిపారు. తెలంగాణలో ఉంటున్న తనకు ఏపీ రాజకీయాల గురించి అవసరం లేదని స్పష్టం చేశారు.

హీరోగా ఒక వెలుగు వెలిగిన న‌టుడు సుమ‌న్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కీల‌క పాత్రల‌తో ప్రేక్షకుల‌ను అల‌రిస్తున్నాడు. నిండైన రూపం కావ‌డంతో.. ఆయ‌న పోషించే పాత్రల‌కు ఆటోమేటిగ్గా హుందాత‌నం వ‌చ్చేస్తుంది. అందుకే సాధార‌ణంగా కీల‌క పాత్రలు, హుందాత‌నం ఉట్టిప‌డే క్యారెక్టర్లకు ద‌ర్శకుల‌కు ఆయ‌న బెస్ట్ చాయిస్. సినిమాల‌తో పాటు చాలాకాలంగా స‌మాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు సుమ‌న్.

Tags

Next Story