High Alert : మధ్యాహ్నం బయటకు రావద్దు.. హై అలర్ట్

X
By - Manikanta |29 April 2024 1:45 PM IST
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 దాటిందంటే చాలు భానుడి ప్రతాపంతో ప్రజలు బయటకురాలేకపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు ఎండ వేడిమికి గురై అనారోగ్యం పాలవుతున్నారు.
దక్షిణ, నైరుతి దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంలో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మే 1వ తేదీన తెలంగాణ, ఏపీల్లో తీవ్ర వడగాల్పులు వీస్తామని వాతావరణశాఖ హెచ్చరించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com