AP : ఏపీకి అన్నీ మంచి రోజులే.. భువనేశ్వరి హామీ

సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) నాయకత్వంలో రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ట్వీట్ చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకుందని పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుంది. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుంది.
అయిదు కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నెరవేరుతుంది... అని నారా భువనేశ్వరి చెప్పారు. నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను. బాధలు విన్నాను. ఇబ్బందులు తెలుసుకున్నాను. అణచివేతను అర్థం చేసుకున్నాను. నేను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజా పాలన మొదలైంది. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే పరిపాలిస్తున్నాం అన్న భావనలో ఉన్నారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com