Nagababu Tweet : నాగబాబు ట్వీట్‌పై అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి స్పందన

Nagababu Tweet : నాగబాబు ట్వీట్‌పై అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి స్పందన

సినీ నటుడు మెగా హీరో నాగబాబు ఇటీవల పరోక్షంగా అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసిన పోస్ట్ సంచలనం రేపింది. మా వాడైనా ప్రత్యర్ధుల కోసం పనిచేస్తున్నారంటే వాడు పరాయి వాడే.. పరాయి వాడైనా మా పక్కన నిలబడితే వాడు మా వాడే అంటూ ఆయన చేసిన ట్వీట్ నెటింట వైరల్ గా మారింది.

ఈ ట్విట్ లో బన్నీ పేరును ఎక్కడ ప్రస్తావించకపోయినా.. అది బన్నీని ఉద్దేశించే చేసిన కామెంట్ అని అందరికీ అర్థమవుతుంది. జనసేనకు ట్విట్టర్ లో సపోర్ట్ ప్రకటించిన అల్లు అర్జున్.. తన స్నేహితుడైన శిల్పా రవి కోసం స్వయంగా నంద్యాలకు వెళ్లి మరి ఎన్నికల ప్రచారం చేస్తూ మద్దతు పలికాడు. తప్పనిసరిగా అల్లు అర్జున్ పై నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేశారని తెలుస్తోంది.

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. బన్నీ స్నేహితుడు శిల్పా రవి తాజాగా స్పందించాడు. నాగబాబు బన్నిని ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేశారో లేదో క్లియర్‌గా మనకు తెలియదు. కానీ ఒకవేళ అది బన్నీని ఉద్దేశించి చేసిన ట్విట్ అయితే మాత్రం దాన్ని ఆయన సంస్కారానికి.. విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేవలం బన్నీ స్నేహబంధంతోనే ఇక్కడికి వచ్చానని ఆల్రెడీ మీడియాతో కూడా చెప్పారు. అంతేకాదు ఓటింగ్ రోజు కూడా నాకు పార్టీలతో సంబంధం లేదు.. నా స్నేహితులు ఏ రంగంలో ఉన్నా నేను వారికి సపోర్ట్ చేస్తా.. నాకు నచ్చితే వారి కోసం ఏదైనా చేస్తా.. అని క్లియర్ గా చెప్పాడంటూ శిల్పా రవి గుర్తు చేశాడు. దీంతో.. శిల్పా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story