AP : పల్నాడు పోలీసు యంత్రాంగం ఫెయిల్: అంబటి

AP : పల్నాడు పోలీసు యంత్రాంగం ఫెయిల్: అంబటి

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ టైంలో పలు ఏరియాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

మంత్రి అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం విఫలమైందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

టీడీపీ నేతలు దారుణంగా దాడులకు పాల్పడుతుంటే.. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు అంబటి. పోలీసులు టీడీపీతో కుమ్మక్కు అయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పల్నాడులో టీడీపీతో పోలీసులు కుమ్మక్కు కావడంతోనే దారుణాలకు ఒడిగట్టారనీ.. పోలీసులు ఎన్నికల విధుల్లో విఫలమయ్యారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

ఎన్నికల సంఘం శాంతిభద్రతల పేరుతో డీజీపీ, ఐజీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులను మార్చిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు పల్నాడులో తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేకపోయారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story