వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా..ఫైర్‌

వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా..ఫైర్‌
వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలే చేసిందని మండిపడ్డారు. విశాఖను అసాంఘిక శక్తులకు అడ్డాగా చేశారంటూ విరుచురుపడ్డారు.

జగన్‌ సర్కార్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలే చేసిందని మండిపడ్డారు. విశాఖను అసాంఘిక శక్తులకు అడ్డాగా చేశారంటూ విరుచురుపడ్డారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని, ఈ విషయంలో జగన్ సిగ్గుపడాలని అమిత్ షా ఘాటుగా వ్యాఖ్యానించారు. మైనింగ్, గంజాయి, మద్యం మాఫియాలకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. నాలుగేళ్లో కేంద్రం… ఏపీకి ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని.. ఆ డబ్బులకు తగ్గట్లుగా ఏపీలో అభివృద్ధి కనిపించిందా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆ నిధులన్నీ ఏమైపోయాయని నిలదీశారు. కేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి తన పేరు .. బొమ్మలు పెట్టుకుంటున్నారని.. చివరికి ఉచితంగా ఇచ్చిన బియ్యానికి కూడా జగన్ తన ఫోటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story