AP : ఎన్నికల అల్లర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, గొడవలు, హింసపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేయనుంది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్.
పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, , చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనుంది సిట్. విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది ఏపీ సర్కార్. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందని సమాచారం.
జరిగిన ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న పోలీసులు….రెండు రోజుల్లో నివేదికను ఈసీకి సమర్పించనున్నారు. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే వేటు వేసింది ఈసీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com