EXIT POLLS: ఎంపీ సీట్లలోనూ కూటమి దూకుడే

EXIT POLLS: ఎంపీ సీట్లలోనూ కూటమి దూకుడే
X
17 నుంచి 20 స్థానాల్లో గెలుస్తుందని అంచనా... వైసీపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం!

ఏపీలోని 25 లోక్‌సభ సీట్లకు... తెలుగుదేశం కూటమి 17 నుంచి 20 స్థానాల్లో గెలుస్తుందని రైజ్ సంస్థ అంచనా వేసింది. వైసీపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. పీపుల్స్ పల్స్ సర్వేలో తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాలు, బీజేపీ 2 నుంచి 4, జనసేన 2, వైసీపీ 3 నుంచి 5 స్థానాలు గెలుస్తాయని పేర్కొంది. పయనీర్‌ సంస్థ.... కూటమికి 20 పైగా స్థానాలు వస్తాయని అంచనావేసింది. వైసీపీ ఐదుస్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. కేకే సర్వేస్‌ తెలుగుదేశం 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. వైసీపీకు ఒక్క సీటు రాదని వెల్లడించింది.

ఇండియా టీవీ సర్వేలోతెలుగుదేశం 13 నుంచి 15 గెలుస్తుందని, బీజేపీ 4 నుంచి 6, జనసేన 2 స్థానాల్లో గెలుస్తాయని తేలింది. వైసీపీ 3 నుంచి 5 స్థానాలకు పరిమితమవుతుందనితెలిపింది. సీఎన్‌ఎక్స్‌ సంస్థ తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాలు, బీజేపీకు 4 నుంచి 6, జనసేన 2సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. వైసీపీ 3 నుంచి 5, స్థానాలు వస్తాయని తేల్చింది. ఇండియా న్యూస్-డీ-డైనమిక్స్‌ సర్వేలో... తెలుగుదేశం కూటమికి 18 పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. వైసీపీకు 7 స్థానాలే వస్తాయని పేర్కొంది. జన్‌కీబాత్‌ సర్వేలో వైసీపీ 10 నుంచి 14 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. తెలుగుదేశం కూటమి 8 నుంచి 13సీట్లు వస్తాయని తేలింది. టైమ్స్‌నౌ ఎగ్జిట్‌పోల్స్‌లో వైసీపీకు 13 నుంచి 15 స్థానాలు, తెలుగుదేశం 7 నుంచి 9, బీజేపీ 2, జనసేన ఒక్క స్థానంలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.


అసెంబ్లీ స్థానాల్లోనూ...

ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్నందుకోబోతున్నట్లు వివిధ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంనచాలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ లెక్క ప్రకారం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒక్కటే 95 నుంచి 110 స్థానాలు గెలుచుకోనుంది. కూటమి మిత్రపక్షాలైన జనసేన 14 నుంచి 20 సీట్లు, బీజేపీ 2 నుంచి 5 సీట్లు దక్కించోవచ్చని....... తెలిపింది. ఇక అధికార వైసీపీ 45 నుంచి 60 స్థానాలకే పరిమితం కాబోతుందని స్పష్టం చేసింది...! లోక్‌సభ ఫలితాల్లోనూ అదే ఒరవడి కొనసాగుతుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే లెక్కలు వేసింది. తెలుగుదేశం 13 నుంచి 15, జనసేన 2, బీజేపీ 2 నుంచి 4 సీట్లు కైవసం చేసుకోనుండగా.. వైసీపీ 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించింది.

Tags

Next Story