Anna Canteens : సెప్టెంబర్ 21 నాటికి అన్న క్యాంటీన్లు: మంత్రి నారాయణ

సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లను ( Anna Canteens ) ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగూరు నారాయణ ( P Narayana ) ఆదేశించారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఇప్పటికే క్యాంటీన్ల పునరుద్ధరణకై తక్షణం రూ.189.22 కోట్లు అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఆమోదం రాగానే సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
నిర్మాణాలు పూర్తి కావలసిన మరో 20 అన్న క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయడంతోపాటు ఆహారం సరఫరా చేసేందుకు అవసరమైన సర్వీస్ ప్రొవైడర్ ను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కోసం కమిటీ నియమించాలని సూచించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా అమలుజరిగాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసివేశారు. అయితే తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తిరిగి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 21 నాటికి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com