AP: రాయి దాడి ఘటనలో అరెస్ట్‌తో ఆందోళన

AP: రాయి దాడి ఘటనలో అరెస్ట్‌తో ఆందోళన
వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారుల అందోళన...బాధితుల తరపున సెర్చ్ వారెంట్ వేయనున్నట్లు ప్రకటించిన లాయర్‌ సలీం

విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు అందోళన చేశారు. గులకరాయి దాడి కేసులో దుర్గారావు అనే వ్యక్తిని తీసుకెళ్లారని నిరసనకు దిగారు. ఠాణా వద్దకు వెళ్లి పోలీసులను విచారించగా... దుర్గారావు అక్కడ లేడని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గారావును వెంటనే విడుదల చేయాలని... డిమాండ్ చేశారు. మరోవైపు వడ్డెర యువకులను పోలీసులు తీసుకెళ్లడంపై కోడికత్తి కేసు శ్రీను తరపున వాదించిన న్యాయవాది అబ్దుల్ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి నుంచి తమ పిల్లల కోసం వేచిచూస్తున్న బాధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. బాధితుల తరపున సెర్చ్ వారెంట్ వేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి డ్రామాలు జగన్‌కు అలవాటేనని..కుట్రలను కోర్టులో తిప్పికొట్టడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చానని న్యాయవాది సలీం తెలిపారు.


చంద్రబాబు ఆగ్రహం

ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం నేతలపై వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ MLA బొండా ఉమాను..సీఎంపై దాడి కేసులో ఇరికించే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. తప్పు చేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిందితులంటూ.... వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై ఆ కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో....... బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి కుట్ర చేశాడని.... తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను జైలుపాల్జేశారని...ఇప్పుడు.. బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని... దుయ్యబట్టారు. సీఎంపై దాడి కేసులో బొండా ఉమామహేశ్వరరావును ఇరికిస్తున్నారని....... డీజీపీ, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌మీనాకు తెలుగుదేశం నేత వర్ల రామయ్య........ ఫిర్యాదు చేశారు. గులకరాయి డ్రామాలో... పాత్రధారులుగా మారిన పోలీస్ అధికారులపై కూటమి ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story